సైంటిస్ట్ గా శర్వా?
శర్వానంద్(sharwanand) హీరోగా శ్రీను వైట్ల(srinu vaitla) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా జార్జ్ క్రిష్(George Krish) పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈసారి శర్వానంద్ కనిపించబోయే క్యారెక్టర్ అతని గత సినిమాలకు భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన జూనియర్ సైంటిస్ట్‌గా కనిపించనుండటంతో, కథలో సైన్స్ నేపథ్యానికి ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారనే ఆసక్తి పెరుగుతోంది. తన క్యారెక్టర్ చుట్టూనే పలు కీలక పరిణామాలు సాగనున్నాయని, వాటికి శ్రీను వైట్ల కామెడీ, ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ కూడా తోడవనున్నాయని సమాచారం.
జార్జ్ క్రిష్ లో శర్వానంద్ మేకోవర్ కూడా స్పెషల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సైంటిస్ట్ క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఆయన లుక్‌ను కొత్తగా డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ విషయంలో పలు పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, భాగ్యశ్రీ బోర్సే(bhagyasri borse)ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. నెక్ట్స్ వీక్ నుంచి ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో శర్వానంద్, భాగ్యశ్రీలపై కీలకమైన లవ్ ట్రాక్ సీన్స్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో సినిమాలో సైంటిఫిక్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాంటిక్ యాంగిల్‌కు కూడా ప్రాధాన్యం ఉండనుందని అర్థమవుతోంది.
ఇక జార్జ్ క్రిష్ ను సంక్రాంతి సీజన్‌కు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర(anil sunkara) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా శ్రీను వైట్ల మరోసారి తన మార్క్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్రకు భిన్నంగా శర్వానంద్‌ను సైంటిస్ట్‌గా చూపించడం సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావచ్చనే డిస్కషన్ జరుగుతోంది. సైన్స్, కామెడీ, లవ్ ట్రాక్ కలయికను శ్రీను వైట్ల ఏ స్థాయిలో ఎంటర్టైనింగ్గా మలిచారనేది సినిమా రిలీజ్ టైమ్ లో ఆసక్తికరంగా మారనుంది.








