21st September 2026

_________

- Bhuvana

సిల్కీ హెయిర్ కోసం ఇంట్లోనే చేయగల హెయిర్ మాస్క్స్

పండిన అరటిపండు గుజ్జులో చెంచా తేనె కలిపి తలకు పట్టించి 20 నిమిషాలు ఉంచితే పొడిబారిన జుట్టు మృదువుగా మారుతుంది.

అరటిపండు - తేనె హెయిర్ మాస్క్

గుడ్డు తెల్లసొనలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి రాస్తే జుట్టుకు కావలసిన ప్రొటీన్ అంది, సిల్కీ షైన్ వస్తుంది.

గుడ్డు - ఆలివ్ ఆయిల్ మాస్క్

అరకప్పు పెరుగులో రెండు స్పూన్ల కలబంద జెల్ కలిపి తలకు రాసుకుంటే కుదుళ్లు తేమను సంతరించుకుని ప్రకాశిస్తాయి.

పెరుగు - కలబంద జెల్ మాస్క్

కొద్దిగా వేడిచేసిన కొబ్బరి నూనె, తేనె మిశ్రమాన్ని జుట్టు చివర్ల నుండి కుదుళ్ల వరకు రాసి మర్దన చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె - తేనె మాస్క్

రాత్రి నానబెట్టిన మెంతులను మెత్తగా రుబ్బి, అందులో పెరుగు కలిపి మాస్క్ లా వేసుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మారుతుంది.

మెంతులు - పెరుగు మాస్క్

ఉసిరి పొడిలో కొద్దిగా నిమ్మరసం, నీళ్లు కలిపి తలకు పట్టించి ఆరనిస్తే జుట్టు కుదుళ్లు బలపడి నిగనిగలాడతాయి.

ఉసిరి పొడి - నిమ్మరసం మాస్క్

అవిసె గింజలను ఉడికించి తీసిన జెల్‌ను జుట్టుకు రాసుకుంటే కెరాటిన్ ట్రీట్‌మెంట్ లాంటి మృదువైన సిల్కీ నిగారింపు వస్తుంది.

అవిసె గింజల జెల్ మాస్క్