Digital Addiction: సోషల్ మీడియాపై వయసు పరిమితి.. కేంద్రం కీలక నిర్ణయం!
Social Media Regulation: చిన్నారులు, యువతపై సామాజిక మాధ్యమాల (Social Media) ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత పరిమితులను విధించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.
ప్రపంచ దేశాల బాటలో భారత్:
సోషల్ మీడియా వల్ల కలిగే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే చిన్నారుల వినియోగంపై నిషేధాజ్ఞలు విధించాయి. భారత్ కూడా అదే దిశగా పయనిస్తోందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి వివరణ:
ఇటీవల జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డీప్‌ఫేక్‌లు, వయసు ఆధారిత నియంత్రణలపై వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. “అనేక దేశాలు ఇప్పటికే ఈ నియంత్రణలను అమలు చేస్తున్నాయి. భారతదేశంలో కూడా ఇలాంటి వయసు పరిమితులు అవసరమని మేము భావిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక సర్వే,ఎంపీల మద్దతు:
కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, బడ్జెట్ సందర్భంగా ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సైతం డిజిటల్ వ్యసనాన్ని (Digital Addiction) తగ్గించేందుకు వయసు ఆధారిత వ్యవస్థను తీసుకురావాలని సిఫార్సు చేసింది. పలువురు ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చర్చల దశలో ఉన్నప్పటికీ, త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన విధానం వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి













