ప్రీమాంట్ నగరంలో ఘనంగా బతుకమ్మ పండుగ

ప్రీమాంట్ నగరంలో ఘనంగా బతుకమ్మ పండుగ

27-04-2017

ప్రీమాంట్ నగరంలో ఘనంగా బతుకమ్మ పండుగ

అమెరికాలోని ప్రీమాంట్‌ నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాస తెలంగాణ మహిళలు, ఇతర రాష్ట్రాల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత వేద టెంపుల్‌ ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియంలో బతుకమ్మలు పేర్చారు. రాయల్‌ ప్యాలెస్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు కవితతో కలిసి రెండు గంటలపాటు బతుకమ్మ, కోలాటం ఆడారు. ఈ సందర్భంగా కవిత బతుకమ్మ పాటలు చెప్పడంతోపాటు కోలాటంలో యువతులకు తర్ఫీదు ఇచ్చారు. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా, తెలంగాణ అమెరికన్‌ సాంస్కృతిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భారత రాయబార కార్యాలయం కాన్సుల్‌ జనరల్‌ వెంటటేశన్‌ అశోక్‌,  ప్రీమాంట్‌ సిటీ మేయర్‌ బిల్‌ హారిసన్‌, జాగృతి అమెరికా శాఖ అధ్యక్షులు శ్రీధర్‌ బండారు పాల్గొన్నారు.