ASBL NSL Infratech

ర‌జినీ పాత డైలాగ్ ను వాడుకున్న లోకేష్

ర‌జినీ పాత డైలాగ్ ను వాడుకున్న లోకేష్

ర‌జినీకాంత్ కొత్త సినిమా కూలీ టీజ‌ర్ వ‌చ్చాక నెట్టింట ఫ్యాన్స్ తో పాటూ అంద‌రిలోనూ దీని విష‌యంలో మిశ్ర‌మ స్పందనే క‌నిపించింది. టైటిల్ అయితే మంచి మాస్ గా ఉందిక ఆనీ విజువ‌ల్స్ మాత్రం పాత స్టైల్ లోనే ఉన్నాయంటున్నారు. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ అవ‌డం వ‌ల్ల దీనిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు లోకేష్ కెరీర్ లో ఫ్లాప్ అన్న‌దే లేదు. హిట్ మ‌ర్చిపోయిన క‌మ‌ల్‌హాస‌న్‌కు విక్ర‌మ్ రూపంలో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు లోకేష్. అయితే కూలీ టీజ‌ర్ ను కేవ‌లం టైటిల్ రివీల్ కోసం మాత్ర‌మే షూట్ చేశార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. కాక‌పోతే ఈ టీజ‌ర్ లో వీఎఫ్ఎక్స్ క్వాలిటీ, రెగ్యుల‌ర్ స్టైల్ లో ర‌జినీ ఓ డెన్ కు వ‌చ్చి విల‌న్స్ కు చిత్తు రేగ్గొట్టో సీన్స్ మాత్రం నార్మ‌ల్ గా అనిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ వీడియోలో ఓ డైలాగు కూడా వినిపిస్తోంది. ఆ డైలాగ్ ను లోకేష్ రంగా అనే రజినీ పాత సినిమా నుంచి తీసుకున్నాడు. స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు వాడుకున్నా స‌రే ఎప్పుడో 40 ఏళ్ల నాటి సన్నివేశాన్ని వాడుకోవడం చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కూలీ అనే టైటిల్ ను ఎందుకు పెట్టార‌నేది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. జైల‌ర్ త‌ర్వాత స్పీడ్ పెంచిన ర‌జినీకాంత్ మొత్తానికి వ‌రుసపెట్టి స్పీడ్ గా సినిమాలు చేసేస్తున్నాడు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :