దాశరథి సోదరుల విగ్రహాల ఆవిష్కరణ

దాశరథి సోదరుల విగ్రహాల ఆవిష్కరణ

22-04-2017

దాశరథి సోదరుల విగ్రహాల ఆవిష్కరణ

ఖమ్మంలోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సాహితీ వేత్తలు దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల క్యాంస విగ్రహాలను రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహితీ సేవలో భాగంగా తానా ఆధ్వర్యంలో సాహితీమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ పాపాలాల్‌, కన్వీనర్‌ మువ్వా శ్రీనివాసరావు, తాతా మధుసూదన్‌, కో కన్వీనర్‌ కాటేపల్లి నవీన్‌బాబు, తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తదితరులు పాల్గొన్నారు.