గ్రేటర్ బోస్టన్ సంక్రాంతి వేడుకలు

గ్రేటర్ బోస్టన్ సంక్రాంతి వేడుకలు

22-04-2017

గ్రేటర్ బోస్టన్ సంక్రాంతి వేడుకలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ బోస్టన్‌ (టిఎజిబి)ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను జనవరి 28వ తేదీన వైభవంగా నిర్వహించారు. మార్ల్‌బోరోలోని విట్‌కంబ్‌ మిడిల్‌ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా చిన్నారులకు భోగిపళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన చిన్నారులతోపాటు, అమెరికాలోని చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యదర్శి రమణ దుగ్గరాజు ఈ సందర్భంగా సంక్రాంతి వేడుకల విశేషాలను తెలియజేశారు. ప్రార్థనా గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10 గంటలపాటు జరిగిన ఈ వేడుకల్లో పద్య పఠనం, కూచిపూడి నృత్యరూపకాలు, స్వరాలాపన వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీమతి శైలజ చౌదరి ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యాలయ వారు 'చండాలిక' నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణకు నివాళులు అర్పిస్తూ శ్రీమతి పద్మజ బాల, వారి టీమ్‌ ప్రదర్శించిన 'స్వరరాగ గాన సుధ' కార్యక్రమం ఆకట్టుకుంది. సాయి సీతం రాజు చేసిన మిమిక్రీ, శిశిర్‌ మహావాది చేసిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచాయి.\r\n\r\n

కమిటీ ప్రెసిడెంట్‌ చంద్ర తాళ్ళూరి అందరికీ ధన్యవాదాలు చెబుతూ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు, వేడుకలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. తానా మాజీ అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, బోర్డ్‌ ట్రస్టీస్‌ చైర్మన్‌ డా. హరిబాబు ముద్దనను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ వేదికపైనే 2017-18 సంవత్సరానికిగాను నిర్వహించిన కార్యవర్గ కమిటీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించారు. ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌ బచ్చు, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా మణిమాల చలుపాది, సెక్రటరీగా ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి పెనుబోలు, ట్రెజరర్‌గా సీతారామ్‌ అమరవాది, కల్చరల్‌ సెక్రటరీగా దీప్తి గోర కనుపర్తి, జాయింట్‌ సెక్రటరీగా రామకృష్ణ పెనుమర్తి, జాయింట్‌ ట్రెజరర్‌గా సత్య పరకాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్ట్‌ ట్రస్టీ సభ్యుల ఎన్నికను కూడా ప్రకటించారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ మెంబర్స్‌ చైర్మన్‌గా శ్రీనివాస్‌ కొల్లిపర, వైస్‌చైర్మన్‌గా శశికాంత్‌ వల్లిపల్లి, ట్రస్టీలుగా మూర్తి కన్నెగంటి, రాజా చిలకమర్రి, శంకర్‌ మాగాపు, పద్మావతి పరకాల, చంద్ర తాళ్ళూరి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి మణిమాల వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిశాయి.


Click here for Event Gallery