తల్లి అయినా సెరెనా

తల్లి అయినా సెరెనా

02-09-2017

తల్లి అయినా సెరెనా

టెన్నిస్‌ స్టార్‌ సెరెరా విలియమ్స్‌ ఇంట సందడి నెలకొంది. టెన్నిన్‌ నంబర్‌ వన్‌ ఛాంపియన్‌ అయిన  సెరెనా విలియమ్స్‌ కాబోయే భర్త అలెక్సిస్‌ ఒహనియన్‌ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడా వెస్ట్‌ పామ్‌ బీచ్‌ లోని ఓ మెడికల్‌ సెంటర్‌లో ఆమెకు పాప పుట్టిన్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. దీంతో టెన్నిస్‌ ఆటగాళ్లతో పాటు అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా సెరెనాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ను సెరెనా గెలుచుకున్న సంగతి తెలిసిందే. సెరెనా ఇప్పటి వరకు 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ మాజీ నంబర్‌వన్‌ 2018లో తిరిగి టెన్నిస్‌ కోర్టులో అడుగుపెడుతుందని ఆమె కోచ్‌ తెలిపాడు.