అమెరికన్‌ కంపెనీ చేతికి డీఆర్‌జీ

అమెరికన్‌ కంపెనీ చేతికి డీఆర్‌జీ

18-01-2020

అమెరికన్‌ కంపెనీ చేతికి డీఆర్‌జీ

పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన డిసిషన్‌ రిసోర్సెస్‌ గ్రూప్‌ (డీఆర్‌జీ) వ్యాపారాన్ని క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే అమెరికన్‌ కంపెనీ 95 కోట్ల డాలర్లకు (రూ.6,745 కోట్ల పైమాటే) కొనుగోలు చేసింది. ఈ డీల్‌ ద్వారా సమకూరే నిధులను రుణ భారం తగ్గించుకోవడంతో పాటు వ్యాపార విస్తరణకు ఉపయోగించుకోనున్నట్లు పిరామల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరామల్‌ తెలిపారు. వచ్చే నెలాఖరు కల్లా ఈ ఒప్పందం పూర్తి కావచ్చని అంచనా. పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 2012లో డీఆర్‌జీలో 65 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అందులో 26 కోట్ల డాలర్లు ఈక్విటీగా సమకూర్చింది.