కాల్షియం మాత్రలతో కేన్సర్!

కాల్షియం మాత్రలతో కేన్సర్!

12-04-2019

కాల్షియం మాత్రలతో కేన్సర్!

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, విటమిన్లు చాలా అవసరం. అయితే, వాటిని ఆహారం ద్వారానే తీసుకోవాలి. అంతేగానీ, మాత్రలు, సప్లిమెంట్స్‌ రూపంలో తీసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని అమెరికాలోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాల్షియం సప్లిమెంట్స్‌ను ప్రతిరోజూ వెయ్యి మిల్లీ గ్రాములకు మించి తీసుకోవడం వల్ల కేన్సర్‌ వచ్చే ముప్పు అధికమని చెబుతున్నారు. 20 ఏళ్లు పైబడిన 27వేల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.