వలసలను ఎప్పటిలాగే అనుమతించాలి

వలసలను ఎప్పటిలాగే అనుమతించాలి

22-03-2019

వలసలను ఎప్పటిలాగే అనుమతించాలి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వలస విధానం ఎప్పటిలాగే కొనసాగాలని, వలసవాసులను కుదించడం తగదని కోరుకుంటున్న అమెరికన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలోకి వలసవాసులను అడ్డుకోవాలని  2016లో 41 శాతం మంది కోరుకున్నారు. ఇప్పుడు అటువంటి వారి సంఖ్య 34 శాతానికి తగ్గింది. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే 23 శాతం మంది అమెరికన్లు వలసలను మరింత అనుమతించాలని కోరడం. వలసల స్థాయిని యధాతథాంగా వుంచాలా? తగ్గించాలా అని ప్రశ్నిస్తే వలసలను తగ్గించడం కన్నా ఎప్పటిలాగే కొనసాగించడం మంచిదని 41 శాతం మంది చెప్పారు.