డిమాండ్‌ వస్తే ఆ సీన్స్‌కు ఓకే

డిమాండ్‌ వస్తే ఆ సీన్స్‌కు ఓకే

25-01-2020

డిమాండ్‌ వస్తే ఆ సీన్స్‌కు ఓకే

గ్లామర్‌ షో, బోల్డ్‌గా నటించడం, లిప్‌లాకులకు ఓకే చెప్పడం, ఇవన్నీ కథ డిమాండ్‌ మేరకు ఉంటాయని కొంతరు హీరోయిన్లు అంటారు. కానీ మరికొందరేమో కావాలని వీటన్నింటినీ సినిమాలో ఇరికించి కథ డిమాండ్‌ చేసింది అనే సాకు చెప్తారని.. ఇది ఫిలిం ఇండస్ట్రీలో చాలా సాధారణ విషయమని అంటారు. కథ డిమాండ్‌ చేసిందని అంటే చాలు ఏదైనా చెల్లుతుందని వాళ్లు ఉద్దేశం. ఇప్పుడు తమన్నా ఇలాంటి రాగమే అందుకుంది. తెలుగు సినిమాల్లో ప్రస్తుతం బోల్డ్‌ కంటెంట్‌ ట్రెండ్‌ నడుస్తోందని ఈ భామ చెప్పింది. తనకు కూడా బోల్డ్‌ సినిమాల్లో నటించాలని ఉందని.. కాకపోతే తన వద్దకు అలాంటి కథలు ఇప్పటివరకు రాలేదని తమన్నా చెప్పింది. మరి లిప్‌లాకులకు మీరు సిద్ధమేనా అని అడిగితే అటువంటి కథలు వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది ఈ భామ. కథ డిమాండ్‌ వస్తే తప్పకుండా లిప్‌ లాక్‌ సీన్స్‌ చేస్తుందట.