ఉప్పెన ఫస్ట్‌లుక్‌ విడుదల

ఉప్పెన ఫస్ట్‌లుక్‌ విడుదల

24-01-2020

ఉప్పెన ఫస్ట్‌లుక్‌ విడుదల

సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్టవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. కృతిశెట్టి నాయిక. విజయ్‌ సేతుపతి కీలక పాత్రధారి. బుచ్చిబాబు సాన దర్శకుడు. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఏప్రిల్‌ 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాతలు నవీన్‌ఎర్నేని, రవిశంకర్‌ మాట్లాడుతూ సుకుమార్‌ శిష్యుడైన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. వైష్టవ్‌తేజ్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పాత్ర కోసం శరీర ఆకృతిని మార్చుకున్నాడు అన్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.