నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తా

నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తా

11-09-2019

నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తా

రేసుగుర్రం సినిమాతో సౌత్‌కి పరిచయమయ్యారు భోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌. తన నటనతో మెల్లిగా దక్షిణాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ప్రస్తుతం నాలుగు భోజ్‌పురి, ఒక హిందీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జీవితంలో సినిమా చేయాలని ఉందని ఇటీవల రవికిషన్‌ పేర్కొన్నారు. మన నాయకుల సత్తాను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే భోజ్‌పురి భాషలో నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించాలనుకుంటున్నాను. అంతేకాదు బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రల్లో కూడా నటించాలని ఉంది. స్వామి వివేకానంద బయోపిక్‌పై కూడా ఆసిక్తిగా ఉంది అని చెప్పుకొచ్చారు రవికిషన్‌.