మెగాస్టార్‌ అతిథిగా ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ

మెగాస్టార్‌ అతిథిగా ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ

24-08-2019

మెగాస్టార్‌ అతిథిగా ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ

మాయాబజార్‌లో ఘటోత్కచుడిగా, భక్త ప్రహ్లాద లో హిరణ్యకశ్యపునిగా, నర్తనశాల లో కీచకుడిగా, అనార్కలి లో అక్బర్‌గా, యశోద కృష్ణ, శ్రీ కృష్ణ లీలలు చిత్రాల్లో కంశుడిగా, పాండవ వనవాసంలో ధురోద్యనుడిగా, సతీ పావిత్రిలో యముడిగా... ఒకటా రెండా ఎన్నో పాత్రల్లో జీవించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయ స్థానం సొంతం చేసుకున్న నటుడు ఎస్వీ రంగారావు (ఎస్వీఆర్‌). ఆయన విశ్వ నటచక్రవర్తి, నటసార్వభౌమ బిరుదులు అందుకున్నారు. ఈ నెల 25న తాడేపల్లిగూడెంలో ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది.