సినిమా రంగంపై వర్క్‌షాప్‌

సినిమా రంగంపై వర్క్‌షాప్‌

21-08-2019

సినిమా రంగంపై వర్క్‌షాప్‌

ప్రజలకు సినీరంగంపై మరింత అవగాహన పెంచేందుకు వయాకామ్‌ సంస్థ సిద్ధమైంది. ఇటీవలే నమ్మథుడు 2 చిత్రాన్ని భాగస్వామ్యంతో ఆ సంస్థ నిర్మించింది. ఇప్పుడు వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. నాగార్జున, అమల, కె.విశ్వనాథ్‌ నిర్వహణలో జరుగుతుందని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండర్‌ శివేంద్ర సింగ్‌ దుంగార్‌పూర్‌, వయాకామ్‌ 18 గ్రూప్‌ ఎండి. సుధాంశు వత్స్‌ తెలియజేశారు. ఈ వర్క్‌షాపు హైదరాబాద్‌లో డిసెంబర్‌ 8నుంచి 15 వరకు జరుగుతుందని, ఇండియాతో పాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆప్ఘనిస్తాన్‌ నుంచి కూడా డెలిగేట్లు పాల్గొననున్నారని వారు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌కు ఆప్లికేషన్లను ఈ నెల 25 నుంచి అక్టోబరు 20 వరకు స్వీకరిస్తారు. అప్లికేషన్లను ఫిల్మ్‌హెరిటేజ్‌ఫౌండేషన్‌.కో.ఇన్‌. నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.