హైదరాబాద్‌లో లెజెండ్స్‌ సంగీత కచేరి

హైదరాబాద్‌లో లెజెండ్స్‌ సంగీత కచేరి

21-08-2019

హైదరాబాద్‌లో లెజెండ్స్‌ సంగీత కచేరి

కె.జె.ఏసుదాస్‌, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, కెయస్‌ చిత్రలాంటి లెజెండరీ సింగర్స్‌తో ఎలెవన్‌ పాయింట్‌ టు, బుక్‌ మై షో సంయుక్తంగా లెజెండ్స్‌ సంగీత కచేరిని నవంబర్‌ 30న హైదరాబాద్‌లోని గౌచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఎస్‌పి బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్‌పి చరణ్‌ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కచేరీలో నేను, ఏసుదాస్‌, చిత్ర కేవలం తెలుగు పాటలు మాత్రమే పాడనున్నాం. గతంలో ఇతర దేశాలలో ఈ తరహా సంగీత కచేరీ చేశాం. కానీ ఇక్కడ తెలుగులో ఇదే ప్రథమం. ఇంతకు ముందు సింగపూర్‌లో మా అబ్బాయి చరణ్‌, ఎలెవన్‌ పాయింట్‌ టు బుక్‌ మై షో వారు దీన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడా కూడా అదే విధంగా ఎంతో ప్లాన్డ్‌గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని అన్నారు. ఈ సమావేశంలో ఎస్‌పి చరణ్‌ తదిరులు పాల్గొన్నారు.