బాలయ్య కోసం బికినీ?

బాలయ్య కోసం బికినీ?

19-08-2019

బాలయ్య కోసం బికినీ?

నందమూరి బాలకృష్ణ- కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదిక నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్ర పోషిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా బ్యాంకాక్‌ షెడ్యూల్‌లో బాలయ్య-సోనాలపై ఓ సాంగ్‌ షూట్‌ చేయనున్నారు. ఈ సాంగ్‌ కోసం సోనాల్‌ బికినీ వేస్తోందని తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్కానరు. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి లెజెండ్‌, డిక్టేటర్‌ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. డిక్టేటర్‌ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమిత కనిపించనుంది. సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రూలర్‌ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.