ఉత్తమ నటికి మెగాస్టార్‌ అభినందన

ఉత్తమ నటికి మెగాస్టార్‌ అభినందన

17-08-2019

ఉత్తమ నటికి మెగాస్టార్‌ అభినందన

మహానటి చిత్రంలో సావిత్రిగా అద్భుత నటన ప్రదర్శించిన కీర్తి సురేష్‌కు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కీర్తి ప్రశంసలు అందుకున్న ఆమెను తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు. కతర్‌ రాజధాని దోహలో జరిగిన సైమా అవార్డు వేడుకలో ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఇదే వేడుకకు కీర్తి సావిత్రిని తలపించేలా సంప్రదాయ చీరకట్టుతో హాజరైంది. ఆమె మెగాస్టార్‌ చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు అందుకుంది.