1400 డ్యాన్సర్స్ ...1.30 కోట్లతో సాంగ్!

1400 డ్యాన్సర్స్ ...1.30 కోట్లతో సాంగ్!

15-04-2019

1400 డ్యాన్సర్స్ ...1.30 కోట్లతో సాంగ్!

లారెన్స్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం కాంచన 3. బి.మధు నిర్మాత. ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ చిత్రం కోసం పద్నాలుగు వందల మంది డ్యాన్సర్లతో ఓ పాటని తెరకెక్కించారు. అందుకోసం దాదాపు కోటి ముప్పై లక్షలు ఖర్చు చేశారు. నిర్మాత మాట్లాడుతూ లారెన్స్‌ చిత్రాల్లో పాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలోనూ మంచి సంగీతం కుదిరింది. నాలుగు వందల మంది అఘోరా గెటప్పులతో, దాదాపు పద్నాలుగు వందల మంది డ్యాన్సర్లతో ఓ పాట చిత్రీకరించాం. కాంచన 3లో ఈ గీతం ప్రధాన ఆకర్షణ కానుంది. లారెన్స్‌ గెటప్పులు ఆకట్టుకుంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ చిత్రంలో వేదిక ఓ కీలక పాత్రలో నటించింది.