మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు

మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు

29-11-2017

మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు

మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రహ్మణి స్పందించారు. వ్యాపారవేత్త అయిన బ్రహ్మణి మంగళవారం నాడు పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఉపాసనతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఈఎస్ మహిళా పారిశ్రామిక వేత్తల్లో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. చిన్న సంస్థల్లో మహిళలకు ప్రోత్సాహం తక్కువగా ఉందనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చిన ఆమె ప్రతి సంస్థలోనూ ఒక మహిళా డైరెక్టర్ ఉండాలని అన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. ఈ సదస్సు చాలా ముఖ్యమైనదని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయనే విషయం ఈ సదస్సు ద్వారా మరోసారి వెల్లడవుతోందని పేర్కొన్నారు.