27న హైదరాబాద్‌కు ఇవాంక రాక

27న హైదరాబాద్‌కు ఇవాంక రాక

21-11-2017

27న హైదరాబాద్‌కు ఇవాంక రాక

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ ఈనెల 27న హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా వెస్టిన్‌ హోటల్‌ వెళ్తారు. 28న ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీకి వెళ్లి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతారు. ఈ మేరకు తెలంగణ ఇంటెలిజెన్సు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇవాంక రాకకు నాలుగు రోజుల ముందుగానే యుఎస్‌ అధ్యక్షుని కుటుంబ సభ్యుల రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమాండోలు నగరానికి రానున్నారు. ఇప్పటికే ఇవాంక సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించాయి. వైట్‌హౌస్‌ ప్రతినిధికి కల్పించే ప్రొటోకాల్‌ ఇవాంకకు అమలు చేయనున్నట్లు తెలిసింది. భద్రత విషయంలో యుఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు కూడా డీజీపీకి సృష్టమైన నోట్‌ పంపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వారికి సమాధానం అందింది.