గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

19-08-2019

గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్ల వినియోగంపై వారు ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లేఖను గవర్నర్‌కు అందజేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడాన్ని టీడీపీ నేతలు ఈ సందర్భంగా గవర్నర్‌కు గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పూనుకొంటోందని డ్రోన్‌ ఎగరవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్‌ నివాసంలో ఉండే కిరణ్‌ ఆదేశాలమేరకు చిత్రీకరించానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ నేతలు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్‌, కేశినేని నాని, గల్లా జయదేవ్‌ తదితరులు ఉన్నారు.