డాక్టర్ శారదాపూర్ణ శొంఠి మృతికి తెలుగు కళా సమితి (TFAS) నివాళి
TFAS: అమెరికాలో భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యం, కళల వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన డాక్టర్ శారదాపూర్ణ శొంఠి (1951-2026) గారి మృతి పట్ల తెలుగు కళా సమితి (TFAS) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మరణం తెలుగు, భారతీయ సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని పేర్కొంటూ సమితి ప్రతినిధులు హృదయపూర్వక నివాళులర్పించారు.
సుమారు 24 పుస్తకాలు..
శారదాపూర్ణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె తెలుగు, సంస్కృతం మరియు సంగీత శాస్త్రాలలో అపారమైన పాండిత్యాన్ని కలిగి ఉన్నారు. తన జీవిత కాలంలో వివిధ అంశాలపై సుమారు 24 పుస్తకాలను రచించి, భారతీయ జ్ఞాన సంపదను, సంస్కృతిని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె రాసిన పుస్తకాలు, వ్యాసాలు భవిష్యత్ తరాల పండితులకు, రచయితలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని TFAS కొనియాడింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు..
వేద అధ్యయనాలు, తత్వశాస్త్రం, సాహిత్య రంగాలలో ఆమె చేసిన కృషి మరువలేనిది. ఆమె కవిత్వం, సృజనాత్మక రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని తెలుగు కళా సమితి ప్రార్థించింది.
ఇవి కూడా చదవండి








