జూన్ 13 నుంచి డెలావేర్లో ‘మాటా’ క్రికెట్ టోర్నీ..
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో జూన్ నెలలో భారీ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. క్రీడాభిమానులను, తెలుగు కమ్యూనిటీని ఉత్సాహపరిచే లక్ష్యంతో డెలావేర్‌లోని లమ్స్ పాండ్ స్టేట్ పార్క్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి.
వివరాలు..
- తేదీలు: జూన్ 13 , జూన్ 14, 2026.
- సమయం: ఉదయం 8:00 గంటలకు ప్రారంభం.
- వేదిక: ఏరియా 1 గ్రౌండ్, లమ్స్ పాండ్ స్టేట్ పార్క్ (1068 Howell School Rd, Bear, DE).
- రిజిస్ట్రేషన్ ఫీజు: ఒక టీమ్‌కు 350 డాలర్లు.
ఆకర్షణీయమైన బహుమతులు..
ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన జట్లకు భారీ నగదు పురస్కారాలను అందించనున్నారు.
- విజేత (Winner): $1500 నగదు , ట్రోఫీ.
- రన్నరప్ (Runner-up): $750 నగదు , ట్రోఫీ.
కన్వెన్షన్ వేదికగా బహుమతుల ప్రధానం..
ఈ టోర్నమెంట్ విజేతలకు జూన్ 19-20 తేదీలలో పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో జరిగే ‘మాటా (MATA) 2వ కన్వెన్షన్’ వేడుకల్లో భాగంగా బహుమతులను అందజేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక మహాసభల్లో వేలాది మంది ప్రతినిధుల సమక్షంలో క్రీడాకారులను గౌరవించనున్నారు.
నిర్వాహక బృందం , రిజిస్ట్రేషన్..
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ఎం.ఎ.టి.ఎ అధ్యక్షులు రమణ కిరణ్ దుడ్డగి, కన్వీనర్ శ్రీధర్ గూడాల నేతృత్వంలోని కార్యవర్గ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. టోర్నమెంట్లో పాల్గొనదలచిన వారు పోస్టర్‌లోని QR కోడ్ ద్వారా లేదా tinyurl.com/MATADECricket లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం శేషు (267-275-3281) లేదా జై (712-265-1151)లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.








