అమెరికాలో MATA 2వ కన్వెన్షన్ సందడి: జూన్ 20న యువత కోసం ప్రత్యేక ‘యూత్ ఫోరమ్’
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ కన్వెన్షన్ వేడుకలు పెన్సిల్వేనియాలోని ఓక్స్ (Oaks) నగరంలో జూన్ 19 , 20 తేదీలలో జరగనున్నాయి. గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ వేదికగా జరిగే ఈ మహాసభల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
యువత కోసం ప్రత్యేక యూత్ ఫోరమ్..
కన్వెన్షన్ రెండో రోజైన జూన్ 20, 2026 (శనివారం) నాడు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు (EST) ప్రత్యేకంగా ‘యూత్ ఫోరమ్’ నిర్వహించనున్నారు. “కల్చర్, టాలెంట్, ఫన్” (సంస్కృతి, ప్రతిభ, వినోదం) అనే నినాదంతో యువతను ఉత్సాహపరిచేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు.
ఆకర్షణలు ..
ఈ ఫోరమ్‌లో పాల్గొనే యువత కోసం పలు ఆసక్తికరమైన అంశాలను కమిటీ ఏర్పాటు చేసింది.
- సినీ తారలతో ముఖాముఖి: ప్రముఖ సినీ నటులను కలిసే (Meet & Greet) అద్భుత అవకాశం.
- సరదా క్రీడలు: కహూత్ (Kahoot), మూవీ ట్రివియా వంటి క్విజ్ పోటీలు , ఫన్ గేమ్స్.
- ఆకర్షణీయమైన బహుమతులు: పోటీల్లో గెలుపొందిన వారికి ఎక్సైటింగ్ ప్రైజెస్ అందజేత.
నిర్వాహక కమిటీ ..
ఈ యూత్ ఫోరమ్ కార్యక్రమానికి చైర్‌గా సాయి చేతన్ దండమూడి, కో-చైర్లుగా శరణ్య దుడ్డగి, అన్విత గూడూరు వ్యవహరిస్తున్నారు. కళ్యాణి బెల్లంకొండ, బాలాజీ జిల్లా సలహాదారులుగా పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల వారు పోస్టర్లో అందించిన లింక్ ద్వారా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
కమిటీ సభ్యులు..
మాటా అధ్యక్షులు రమణ కిరణ్ దుడ్డగి, కన్వీనర్ శ్రీధర్ గూడాల, కో-కన్వీనర్ టోనీ జన్న నేతృత్వంలో కార్యవర్గ కమిటీ సభ్యులు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వ్యవస్థాపకులు , సలహా కమిటీ సభ్యులైన శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డిల మార్గదర్శకత్వంలో ఈ కన్వెన్షన్ జరగనుంది. మరిన్ని వివరాల కోసం మాటా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.








