మాటా సింగింగ్ స్టార్ 2026 పేరుతో త్వరలో ఘనంగా గాత్ర పోటీలు
మన అమెరికా తెలుగు సంఘం (మాటా) జూన్ 19 20 తేదీల్లో ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ లో నిర్వహించనున్న రెండో కన్వెన్షన్ లో భాగంగా మాటా సింగింగ్ స్టార్ 2026 పోటీలను నిర్వహిస్తోంది. శాస్త్రీయ లలిత సంగీత విభాగాల్లో ప్రతిభావంతులైన గాయకులను ప్రోత్సహించేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు గాయకులు డాక్టర్ రామాచారి కోమండూరి ఈ పోటీలకు అడ్వైజర్ గా మెంటర్ గా వ్యవహరించడం విశేషం.
ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్ ప్రిలిమ్స్ ఆన్లైన్ ద్వారా జరుగుతాయి. సెమీస్ గ్రాండ్ ఫినాలే పోటీలు కన్వెన్షన్ వేదికపై ప్రత్యక్షంగా నిర్వహించబడతాయి. ఇందులో పాల్గొనేందుకు 6 నుండి 11 ఏళ్ల లోపు వారు సబ్ జూనియర్స్ గా, 12 నుండి 18 ఏళ్ల వారు జూనియర్స్ గా 19 ఏళ్ల పైబడిన వారు అడల్ట్స్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమోదు రుసుము 20 డాలర్లుగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్లు మార్చి 22వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆసక్తి గల వారు వెంటనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుడ్డాగి కన్వెన్షన్ బృందం కోరింది. ఇతర వివరాల కోసం కన్వెన్షన్ వెబ్సైట్ లేదా బ్రోచర్లోని ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.








