అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్ ల హావా
అమెరికన్ కాంగ్రెస్‌లో భారతీయ-అమెరికన్లు తమ ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో, ప్రజాప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)కు ప్రతినిధులుగా ఉన్న నలుగురు డెమోక్రటిక్ సభ్యులు మళ్లీ ఎన్నికవ్వగా, మరో ఇద్దరూ కాంగ్రెస్‌లో అడుగుపెడుతూ తమ ముద్ర వేశారు. అమీ బెరా, రో ఖన్నా, సుహాస్ సుబ్రమణ్యం మరియు ప్రమీలా జయపాల్‌లు తిరిగి విజయం సాధించగా, పియా డాండియా, అమిష్ షా తొలిసారి విజయం సాధించి అమెరికా కాంగ్రెస్‌లో భారతీయ-అమెరికన్ల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచారు.
కాలిఫోర్నియా నుంచి అమీ బెరా ఎనిమిదోసారి విజయం సాధించగా, రో ఖన్నా, జయపాల్ కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రమణ్యం రెండోసారి విజయం సాధించారు. మరోవైపు, ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పియా డాండియా 51.9 శాతం ఓట్లతో గెలుపొందారు. ఇతర స్థానాల్లో, మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ మరొక విడత విజయాన్ని అందుకున్నారు. అయితే, ఒహియో గవర్నర్ రేసులో పోటీ చేసిన భారతీయ-అమెరికన్ రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి, డెమోక్రాట్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో ఓటమి పాలయ్యారు. లాస్ ఏంజెల్స్ మేయర్‌గా నిత్యారామన్ విజయం సాధించడం విశేషం. అమెరికాలో 50 లక్షలకు పైగా ఉన్న భారతీయ-అమెరికన్ సమాజం యొక్క పెరుగుతున్న రాజకీయ ప్రభావాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల్లో గెలుపొందిన భారతీయ అమెరికన్ నేతలు
అమీ బేరా
కాలిఫోర్నియాలోని 3వ జిల్లా నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ఆయన పూర్తి పేరు అమరీశ్ బాబూలాల్ బేరా. 2012లో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గుజరాత్ నుంచి వారి కుటుంబం అమెరికాకి వలస వెళ్లింది. చట్ట సభలోకి రాక మునుపు వైద్య వృత్తిలో వుండేవారు. సాక్రమెంటో కౌంటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా వుండేవారు.
రో ఖన్నా
కాలిఫోర్నియా 17వ జిల్లా నుంచి తిరిగి ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్ కి ఎన్నిక కావడం ఆరోసారి. 2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బెర్నీ శాండర్స్ ప్రచార కార్యక్రమాలకు సారథ్యం వహించారు.
సుహాస్ సుబ్రహ్మణ్యం
వర్జీనియా 10వ జిల్లా నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించారు. హ్యూస్టన్‌లో జన్మించారు సుహాస్. న్యాయవాది, పారిశ్రామికవేత్త. ఒబామా హయాంలో వైట్ హౌస్ టెక్నాలజీ అడ్వైజర్ గా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభలో సభ్యుడు. 2023-2024 అదే రాష్ట్ర సెనేట్ లో సభ్యుడు. సుహాస్ తల్లిదండ్రులది కర్నాటక, తమిళనాడు. కొంత కాలం హైదరాబాద్ లో కూడా నివసించారు.
ప్రమీల జయపాల్
వాషింగ్టన్ 7వ జిల్లా నుంచి హౌస్ సభ్యురాలిగా వున్నారు. అదే స్థానం నుంచి తిరిగి విజయ ఢంకా మోగించారు. 1965లో చెన్నైలో జన్మించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చేశారు. ఎంబీఏ పూర్తి చేసి, 2016లో తొలిసారిగా ప్రతినిధుల సభలో అడుగు పెట్టారు.
పియా దాండియా
ఫ్లోరిడాలోని 22వ జిల్లా నుంచి గెలుపొందారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టకు ముందు టీచర్‌గా, హైస్కూల్ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఫ్లోరిడా 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి బరిలో నిలిచిన డెమోక్రాటిక్ అభ్యర్థి పియా దాండియా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిన కేసీ అస్కర్ని ఓడించారు. ఫ్లోరిడా నుంచి అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర నెలకొల్పారు. మొత్తం ఓట్లలో పియా దాండియాకి 51.9 శాతం, కేసీ అస్కర్కి 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.
అమిష్ షా
ఆరిజోనాలోని ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుండి అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఎన్నికల్లో విజయం సాధించి, కాంగ్రెస్‌లో ఆరిజోనాకు ప్రాతినిధ్యం వహిస్తు న్న తొలి భారతీయ-అమెరికన్‌గా డాక్టర్ అమిష్ షా చరిత్ర సృష్టిం చారు. 48 ఏళ్ల డాక్టర్ షా యు.ఎస్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన ఆరో భారతీయ-అమెరికన్‌గా నిలిచారు. ఆరిజోనా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ షా, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపిన మాజీ ఎనఎఫఎల్ (చీఖీL) ఆటగాడు, రిపబ్లికన్ అభ్యర్థి జే ఫీలీపై విజయం సాధించారు.
అరుణా మిల్లర్
మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వరుసగా రెండోసారి గెలుపొందారు. వీరి మూలాలు హైదరాబాద్‌లో వున్నాయి. తండ్రి ఉద్యోగ రీత్యా అమెరికాకి వలసెళ్లారు. అరుణా ఇంజినీరింగ్ చదివి, 25 సంవత్సరాలు పనిచేశారు. 2010లో డెమోక్రటిక్ పార్టీ నుంచి మేరీల్యాండ్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టారు. 8 సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు.
నబీలా సయ్యద్
ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్ 26వ డిస్ట్రిక్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై నబీలా విజయం సాధించారు. నాలుగు సంవత్సరాల కిందే ఇల్లినాయిస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. చిన్న వయస్కురాలిగా రికార్డు కూడా నెలకొల్పారు. నబీలా తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. వారి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకుంటారు.
లాస్ ఏంజెల్స్ మేయర్ రేసులో నిత్య రామన్ విజయం
అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మేయర్ కారెన్ బాస్‌ను ఓడించి లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నికల్లో నిత్యా రామన్ విజయం సాధించారు. దీంతో ఆ నగరానికి మొట్ట మొదటి ఆసియా- అమెరికన్ మేయర్ గా ఖ్యాతి కెక్కారు. నగర స్థాయి అత్యున్నత పదవికి ఎన్నికైన రెండవ మహిళ కూడా ఆమెనే. కేరళలో జన్మించి, అమెరికాలో స్థిరపడిన నిత్యా రామన్.. అరుదైన రాజకీయ ఘనతనే సాధించారు.
లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో 51.1 శాతం ఓట్లు సాధించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌కి 48.33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ ఎన్నికల అంచనాల ప్రకారం నిత్యా రామన్ విజయం ఖాయమైపోయింది. దీంతో ఆమె లాస్ ఏంజెలెస్‌కి 44వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.నిత్యా మీనన్ 1981లో కేరళలో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకి వలస వెళ్లింది కుటుంబం. 22 ఏళ్ల వయస్సులోనే అమెరికా పౌరసత్వం పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.గతంలో సామాజిక సమస్యల పరిష్కారంపై కూడా పనిచేశారు. లాస్ ఏంజెలెస్ రాజకీయాల్లో నిత్యా రామన్‌కి అనుభవం వుంది. 2020లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి సిట్టింగ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు డేవిడ్ ర్యూను ఓడించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఈ సారి కూడా భారతీయులు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. ఒక తరం క్రితం వరకు అమెరికాలోని భారతీయ సంతతి ప్రజలు కేవలం వైద్యం, ఇంజనీరింగ్, ఐటీ, వ్యాపార రంగాలకే పరిమితమయ్యారు. తరువాత కొందరు అమెరికా రాజకీయాల్లో ప్రవేశించి సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో పాత వాళ్ళతో పాటు మరో ఇద్దరు భారతీయ సంతతి నేతలు మొట్టమొదటిసారి చట్టసభల్లోకి ప్రవేశించడం విశేషం. అమెరికాలో భారతీయ సంతతి నేతల రాజకీయం చాలా వరకూ కాలిఫోర్నీయా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలకే పరిమితం. కానీ ఈసారి ఫ్లోరిడా, జార్జియా వంటి రాష్ట్రాల్లో పియా దండియా, జ్యోత్ సింగ్‌ల సాధించిన విజయాలు.. అమెరికా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయమని చెప్పాలి. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెగేషనల్ డిస్ట్రక్ట్ నుంచి భారతీయ మూలాలున్న పియా దండియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి ప్రజాప్రతినిధిగా ఆమె చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కేసీ అక్సర్పై విజయం సాధించారు.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ నేతలు పలువురు సత్తా చాటారు. అమీబేరా అయితే.. ఏకంగా 8వ సారి తిరిగి ఎన్నిక కావడం విశేషం. భారతీయ అమెరికన్ చట్ట సభ సభ్యుల్లో అత్యంత సీనియర్‌గా ఆయనకు ఇప్పటికే పేరుంది. దీన్ని ఈ గెలుపుతో మరింత సుస్థిరం చేసుకున్నారు. అయితే.. డెమోక్రటిక్ ప్రభంజనంతో రిపబ్లిక్ పార్టీ తరపున పోటీలో వున్న పలువురు భారతీయ అమెరికన్లు ఓటమి పాలయ్యారు.
జార్జియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికై.. చరిత్ర సృష్టించిన జ్యోత్ సింగ్
భారతీయ అమెరి కన్ డెమొక్రాట్ జ్యోత్ సింగ్, జార్జియా ప్రతినిధుల సభలో సీటు గెలుచుకుని రాజకీయ చరిత్ర సృష్టించారు. తద్వారా రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొట్ట మొదటి సిక్కు అమెరికన్ మరియు భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. జార్జియాలోని 97వ హౌస్ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ అభ్యర్థిపై సుమారు 68 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. జార్జియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి సిక్కు అమెరికన్ మరియు మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా గుర్తింపు పొందారు.తన విజయాన్ని సంబరంగా జరుపుకుంటూ, సింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. “మనం గెలిచాం!!! ధన్యవాదాలు జార్జియా! Hణ-97 నియోజకవర్గానికి మీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను.” అంటూ పేర్కొన్నారు.అతని ఎన్నిక భారతీయ-అమెరికన్ రాజకీయ ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
జ్యోత్ సింగ్ తల్లిండ్రులు భారత్ నుంచి అమెరికాకి వలస వెళ్లారు. జార్జియాలోని నార్క్రాస్లో ఒక శ్రామిక కుటుంబంలో పెరిగాడు. అతను బేస్మెంట్ అపార్ట్మెంట్లలో నివసించాడు, తన కుటుంబానికి సహాయం చేయడానికి 15 ఏళ్ల వయస్సులోనే పని చేయడం ప్రారంభించాడు మరియు యేల్లో పూర్తి స్కాలర్షిప్ పొందకముందు గ్విన్నెట్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకున్నాడు, అక్కడ అతను 2021లో గ్లోబల్ అఫైర్స్‌లో పట్టభద్రుడయ్యాడు. కళాశాల తర్వాత, అతను బ్లూ హస్కీ గ్రూప్ అనే తన సొంత కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు, రాజకీయ కమ్యూనికేషన్స్‌లో పనిచేశాడు మరియు గ్విన్నెట్ కౌంటీలోని ప్రభుత్వ పాఠశాలల కోసం 1.4 బిలియన్ డాలర్లను సమకూర్చడంలో సహాయపడ్డాడు.
మొదటి భారతీయ అమెరికన్ సెనేట్ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర నెలకొల్పిన ప్రియా సుందరేశన్
భారతీయ అమెరికన్ ప్రియ సుందరేశన్ అరిజోనా సెనేట్ అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆరు దశాబ్దాలలో తొలిసారిగా డెమోక్రాట్లు సెనేట్ సభను, గవర్నర్ కార్యాలయాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేం దుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం కీలకమే. దేశంలో ఓ రాష్ట్ర సెనేట్‌కి నాయకత్వం వహించిన మొట్ట మొదటి భారతీయ అమెరికన్‌గా ప్రియా సుందరేశన్ చరిత్ర నెలకొల్పారు. నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికలలో పార్టీ చారిత్రాత్మక విజయాలు సాధించిన అనంతరం సెనేట్ అధ్యక్షురాలిగా ఎన్నుకో బడ్డారు. మూడు పర్యాయాలు రాష్ట్ర సెనేటర్‌గా పనిచేసిన సుందరేశన్, ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న ఈ సభలో మైనారిటీ నాయకురాలిగా ఉన్నారు. జనవరిలో డెమోక్రాట్లు నియంత్రణ చేపట్టినప్పుడు, ఆమె ఎన్నికతో రాష్ట్ర సెనేట్‌కు సారథ్యం వహించనున్నారు. ఇది పార్టీ శాసనపరమైన అజెండాను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
“మైనారిటీ నాయకురాలిగా నా పదవీకాలంలో మనం కలిసి సాధించిన విజయాల పట్ల నేను గర్విస్తున్నాను. ఇప్పుడు, తదుపరి అధ్యాయంలో మనకు నాయకత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరిజోనా ప్రజలు విభజన వాదాన్ని తిరస్కరించి, కొత్త దిశను ఎంచుకున్నారు. ప్రజల రాజకీయ విశ్వాసాలకు భిన్నంగా, సమస్యలపై దృష్టి సారిస్తానని హామీ ఇస్తున్నాను. దైనందిన జీవితంలో కావాల్సిన అవసరాలను కచ్చితంగా చూస్తాను. దీని ద్వారా ప్రతి రోజూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతా. దీని అర్థం శ్రామిక కుటుంబాలకు ఖర్చులను తగ్గించడం, మన సమాజాలను సురక్షితంగా ఉంచడం మరియు అరిజోనాలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాన్ని కల్పించడం. మీరు ఎక్కడ నివసిస్తున్నా, ఎవరికి ఓటు వేసినా, మీ కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.” అని ప్రకటించారు.
సుందరేశన్ ఈ ఎన్నికల ఫలితాన్ని రిపబ్లికన్ పార్టీ రాజకీయ దిశకు తిరస్కారంగా అభివర్ణించారు. “రిపబ్లికన్లు మన దేశంలో ప్రోత్సహిస్తున్న MAGA తీవ్రవాదానికి ఇది ఒక తిరస్కరణ” అని ఆమె పేర్కొన్నారు.
సుందరేశన్ నేపథ్యమిదీ…
టక్సన్‌లో జన్మించిన సుందరేశన్, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం మరియు సహజ వనరుల అర్థశాస్త్రం వంటి రంగాలలో విద్యా మరియు వృత్తిపరమైన నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. ఆమె 2006లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2011లో, ఆమె అరిజోనా విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డిగ్రీ మరియు అatuతీaశ్రీ తీవsశీuతీcవ వcశీఅశీఎఱcsలో మాస్టర్ డిగ్రీని సంపాదించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు, ఆమె అరిజోనా విశ్వవిద్యాలయంలో సహజ వనరుల చట్టాన్ని బోధించారు మరియు సుస్థిర వనరుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ ఎన్విరాన్మెంటల్ డిఫెన్స్ ఫండ్‌తో కలిసి పనిచేశారు. పర్యావరణ విధానం, చట్టంలో ఆమెకున్న అనుభవం, సహజ వనరులు మరియు సుస్థిరతకు సంబంధించిన సమస్యల విషయంలో శాస్త్రీయ ఆధారిత విధాన రూపకల్పన మరియు సాక్ష్యాధారిత పద్ధతులపై ఆమె దృష్టి పెట్టడానికి దోహదపడింది. ఆమె ఓటింగ్ హక్కులు, ఓటర్ల రక్షణ మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలలో కూడా పాలుపంచుకున్నారు.
మిషిగన్ స్పీకర్‌గా రంజీవ్ పూరి!
అమెరికాలోని మిషిగన్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా డెమోక్రటిక్ పార్టీ తరఫున రంజీవ్ పూరి ఎన్నిక య్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. “ఈ రోజు సహచరుల ద్వారా మిషిగన్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కావడంతో నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. నాపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా అసలు పని మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నా” అని రంజీవ్ తన సంతోషాన్ని ఫేస్ బుక్ పోస్టు ద్వారా వ్యక్తం చేశారు. నవంబర్ మూడున జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 42 ఏళ్ల రంజీవ్ పూరి హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ (రాష్ట్ర) అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇది నెరవేర్చేందుకు మిషిగన్ నుంచి సెనేట్ మెజార్టీ నేతగా ఎన్నికైన ఎన్ని మారిన్ కామిల్లి 6. గవర్నర్‌గా ఎన్నికైన జోస్టిస్ చిన్న క్లతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రంజీవ్ తెలిపారు. 2020లో రంజీవ్ పూరి మిషిగన్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి సిక్కు అమెరికన్‌గా ఎన్నికయ్యారు. 2020లో మిషిగన్‌లోని డిస్ట్రిక్ట్ 21 నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించగా.. 2022, 2024, 2026లలో డిస్ట్రిక్ట్ 24 నుంచి వరుసగా ఎన్నికైన ఘనత రంజీవ్ పూరిది.
పంజాబ్ నుంచి వలస వెళ్లిన తల్లిదండ్రులకు అమెరికాలోనే జన్మించిన రంజీవ్ను 2025లో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న 110 మంది సభ్యులున్న అసెంబ్లీకి డెమొక్రటిక్ పార్టీ నేతగా నియమించారు. “మా తల్లిదండ్రులు ఈ దేశానికి వలస వచ్చినప్పుడు కొడుకు ఈ స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టిస్తాడని ఊహించి ఉండరు. అడ్డంకులను చెరిపేయడం, మిషిగన్ మిషిగన్ అసెంబ్లీకి స్పీకర్‌గా మారడం… ఇదంతా అమెరికా ఇచ్చే నమ్మకం” అని వ్యాఖ్యానించారు.
ఓడిన భారతీయ అమెరికన్లు
భారతీయ-అమెరికన్ రిపబ్లికన్లలో అత్యంత ప్రముఖమైన ఓటమి ఒహాయోలో ఎదురైంది, అక్కడ వివేక్ రామస్వామి గవర్నర్ రేసులో డెమొక్రాట్ అమీ ఆక్టన్ చేతిలో ఓడిపోయారు. ట్రంప్ మద్దతు ఉన్న మాజీ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అయిన రామస్వామి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సొంత రాష్ట్రంలో ప్రచారం చేశారు.దేశవ్యాప్తంగా డెమోక్రాట్లు పట్టు సాధించిన ఈ ఎన్నికల్లో, ఆయన ఓటమి రిపబ్లికన్లకు ఎదురైన చెప్పుకోదగ్గ ఎదురుదెబ్బలలో ఒకటిగా నిలిచింది.
రిపబ్లికన్ సరిత కోమటిరెడ్డి కూడా న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ చేతిలో ఓడిపోయారు. కాలిఫోర్నియాలో రితేష్ టాండన్ రో ఖన్నా చేతిలో ఓడిపోగా, వాషింగ్టన్లో నిరవ్ షెత్ ప్రమీలా జయపాల్ చేతిలో పరాజయం పాలయ్యారు. నార్త్ కరోలినా 4వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుండి పోటీ చేసిన మహేష్ ‘మాక్స’ గనోర్కర్, డెమోక్రటిక్ సిట్టింగ్ సభ్యురాలు వాలెరీ ఫౌషీ చేతిలో ఓటమి పాలయ్యారు.







