హ్యూస్టన్ తెలుగు సంఘం గోల్డెన్ జూబ్లి వేడుకలు
పెద్దలు చేస్తున్న వేడుక ఇది
హ్యూస్టన్ గోల్డెన్ జూబ్లి వేడుకలకు విరాళాలు
హ్యూస్టన్‌లోని హ్యూస్టన్ తెలుగు సంఘం గోల్డెన్ జూబ్లి వేడుకలకు పలువురు కమ్యూనిటీ ప్రముఖులు విరాళాలను అందజేస్తున్నారు. హ్యూస్టన్‌లో ఉంటున్న యలమంచిలి తనవంతుగా 25,000 డాలర్ల విరాళంను ప్రకటించారు. జితేందర్ రెడ్డి 15000 డాలర్ల విరాళం ప్రకటించారు. డాక్టర్ లెనిన్, కవిత పిన్నమనేని 15,000 డాలర్ల విరాళంను అందజేశారు. చల్లా శర్మ`లలిత శర్మ దంపతులు 15,000 డాలర్ల విరాళాలను గోల్డెన్ జూబ్లి వేడుకలకు ఇస్తున్నట్లు ప్రకటించారు.
సాధారణంగా ఏ సిటీలోనైనా ఒక వేడుక చేయటానికి ఆ సిటీలో యువకులు, కార్యవర్గ సభ్యులు ముందుకొస్తారు. పనులు మొదలు పెడతారు. చివరలో కార్యక్రమాల ముందు ఆ సిటిలోని పెద్దలను కూడా పిలుస్తారు. ఆ పెద్దలు కూడా వచ్చి పాల్గొంటారు. ఇది అన్నిచోట్ల జరిగే విషయమే. కానీ హ్యూస్టన్‌లో అలాకాదు.
హ్యూస్టన్ తెలుగు సంఘం 1976లో ప్రారంభమై 2026కు 50 వసంతాలు పూర్తి చేసుకుంటోందని మొదటగా ఫిబ్రవరిలో కొందరు పెద్దలు కలిసి మాట్లాడుకొని ఈ 50 వసంతాలు వేడుకను గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించారు. మొదటగా కనకంబాబు మరికొందరు కలిసి ఒక వాట్సప్ గ్రూప్‌ని తయారు చేశారు. ఆ గ్రూప్‌లో మొదటి 3`4 రోజులలో చేర్చుకున్న సభ్యులలో నేను ఒకడిని. దాదాపు 550 సభ్యులు చేరేదాకా పెద్దగా కూడా ఆ గ్రూపులో కార్యాచరణ కనిపించలేదు. మొదటగా కాన్ఫరెన్స్ కన్వీనర్‌గా జితేందర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. పద్మశ్రీ ముత్యాలగారిని అంబాసిడర్‌గా నియమించారు. వీరు ఇద్దరు హ్యూస్టన్లోనే ఉంటూ హ్యూస్టన్ తెలుగు కమ్యూనిటీకి ఎంతో మంచి పేరు తీసుకువచ్చారు. జితేందర్ రెడ్డి ఆటాలోను.. పద్మశ్రీ ముత్యాల తానాలోనూ ఉన్నత పదవులు నిర్వహించి ప్రస్తుతం తీరిగ్గా ఉండగా వారికి ఈ స్వర్ణోత్సవాల్లో పెద్ద పీట వేయడం మంచి ఆలోచన అభినందనీయం.
ఫిబ్రవరిలో తయారయిన వాట్సాప్ గ్రూప్‌లోనే మెల్లమెల్లగా చాలా మందిని యాడ్ చేశారు. అనేక అభిప్రాయాలు, సూచనలు ఇవ్వడం ప్రారంభమైంది. అంతా ఓపెన్ అన్నిమాట మొదటి వారంలో హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్‌కి కార్యవర్గం ఎన్నుకున్నారు. యాదగిరి రెడ్డి ప్రెసిడెంట్‌గా హెచ్టిఎకి గోల్డెన్ జూబ్లి చేసే కార్యవర్గం కూడా తయారయింది.
వాట్సాప్ గ్రూపులో మొదటిలో కొందరు సభ్యులు 50 ఏళ్ల కిందట హ్యూస్టన్‌లో జరిగిన విశేషాలు, అప్పుడు ప్రచురించిన పత్రికలను పోస్ట్ చేశారు. వంగూరి చిట్టెన్ రాజు, ఆ రోజుల్లోనే జరిగిన వెడుకలలో కొన్ని విశేషాలను వివరిస్తూ ప్రచురించిన కాపీలను పోస్ట్ చేశారు. ఆ విధంగా అందరికీ హెచ్‌టిఎ 50 ఏళ్ళ ప్రయాణం ఎలా జరిగిందో తెలిపారు.
ప్రద్మశ్రీ ముత్యాల 1994 ఉగాది వేడుక కోసం చేసిన నాటితో తయారు చేసిన ఉగాది విశేషాలను పోస్ట్ చేవారు. వంగూరి చిట్టెన్రాజు మధురవాణి అనే మ్యాగజైన్ ద్వారా అప్పటి విశేషాలు చూపించారు. రత్న కుమారి 1977లోనో అమె భర్త అనిల్ కుమార్, వంగూరి చిట్టెన్ రాజు, సూరి దువ్వూరి కలిసి వేసిన బుర్రకథ, విశేషాలు చేప్పారు. అందరికి నచ్చిన ఆ బుర్రకథ 1977 నవంబర్‌లో జరిగిన మొదటి తానా మహాసభల్లో కూడా వేశారు.








