పూరీ మార్క్ మళ్లీ కనిపిస్తుందా?
లైగర్(liger) రిజల్ట్ పూరీ జగన్నాథ్(puri jagannadh) కెరీర్‌ను కొలిచే ప్రమాణం కాదని చెప్పేలా ఆయన గత సినిమాలే నిలుస్తాయి. ఇడియట్(idiot), పోకిరి(pokiri), బిజినెస్‌మ్యాన్(business man), టెంపర్(Temper), ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) వంటి సినిమాలతో ప్రత్యేకమైన హీరోలను, పవర్ఫుల్ డైలాగ్స్‌ను, తనదైన రా కమర్షియల్ టేకింగ్‌ను ఆడియన్స్ కు పరిచయం చేసిన పూరి.. ఇప్పుడు స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum dog: 33 temple road) తో మరో విభిన్న కథను తీసుకొస్తున్నారు. ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెరగడానికి పూరి స్టైలే కాకుండా కథలోని ఎమోషనల్ లేయర్ కూడా మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది.
విజయ్ సేతుపతి(vijay sethupathi) మొదటిసారి పూరితో కలిసి పనిచేస్తున్న ఈ సినిమాలో ఆయన చూపులేని వీధి నివాసిగా కనిపించనున్నారు. మరోవైపు టబు(Tabu) పోషించిన గౌరి హెగ్డే(Gowri hegde) పాత్రకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా కనిపించనున్న టబు.. యాక్షన్ సీన్స్ తో పాటు హైదరాబాదీ యాసలో డైలాగ్స్ చెప్పడం ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచింది. సంయుక్త, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి
అయితే స్లమ్ డాగ్ లో అసలు బలం కేవలం యాక్షన్, మిస్టరీలోనే లేదని పూరి వెల్లడించిన విషయాలు సూచిస్తున్నాయి. వీధుల్లో ఉండేవాళ్లు, సమాజం పెద్దగా పట్టించుకోని వ్యక్తుల జీవితాల్లోని నిజమైన సంఘటనలు, ఎమోషన్ల ఆధారంగా కథను రూపొందించినట్లు ఆయన చెప్పారు. పూరీ స్వయంగా ఎదుర్కొన్న కొన్ని వాస్తవ అనుభవాల ప్రభావం కూడా కథలో ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి పూరి తన ట్రేడ్‌మార్క్ ట్రీట్మెంట్కు ఎమోషన్ ను జోడించి ఆడియన్స్ కు ముందుకు వస్తున్నారనే ఆసక్తి నెలకొంది.








