నాగార్జున కింగ్100 షూటింగ్‌పై అప్డేట్!
అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా నిలవనున్న 100వ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కింగ్100(King100) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా నాగార్జున ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ లో మెయిన్ పార్ట్ పూర్తైందని, కేవలం ఒక సాంగ్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.
మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయని నాగార్జున వెల్లడించారు. నవంబర్ నెలాఖరులోగా సినిమా ఫైనల్ కాపీ రెడీ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. రా. కార్తీక్(Ra. Karthik) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్(Devi Sri prasad) మ్యూజిక్ ను అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), మనం ఎంటర్ప్రైజెస్(Manam Enterprises) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. టబు(Tabu), ఐశ్వర్య రాజేష్(Aiswarya rajesh), అశోక్ సెల్వన్(Ashoka Selvan), రవీంద్ర విజయ్(Ravindra Vijay) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే డిసెంబర్ 24న బాలకృష్ణ దాదా(Dada), షారుఖ్ ఖాన్(Shah rukh Khan) కింగ్(King) సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ పోటీ నెలకొననుంది. నాగార్జున 100వ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి మరి.







