రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన క్రేజీ హీరోయిన్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(ram charan), సుకుమార్(sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సాగుతోంది. పెద్ది(peddi) రిలీజ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చరణ్.. గాయం కారణంగా సర్జరీ చేయించుకుని పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం లుక్‌ను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు చరణ్. ఆర్సీ17(RC17)గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను ఫైనల్ చేయగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా సినిమా ప్రారంభోత్సవం నిర్వహించి, డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ధురంధర్(Dhurandhar) ఫేమ్ సారా అర్జున్(Sara arjun) పేరు వినిపిస్తోంది. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ యంగ్ హీరోయిన్, ధురంధర్ రిలీజ్ తర్వాత కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. అయితే సుకుమార్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ చరణ్ సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు ఆర్సీ17 మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander), శాశ్వత్ సచ్దేవ్(Saswath sachdev) పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరిని త్వరలోనే ఫిక్స్ చేయనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాను 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. చరణ్- సుకుమార్ కలయికలో రానున్న ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








