ది డర్టీ పిక్చర్2 పై బాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్!
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ది డర్టీ పిక్చర్(the dirty pictures) సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండటంతో ఇప్పుడు అందరి దృష్టి హీరోయిన్ ఎంపికపై పడింది. 2011లో విద్యాబాలన్(Vidya balan) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడమే కాకుండా, నటిగా ఆమెకు నేషనల్ అవార్డును సైతం అందించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీని మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు నిర్మాత ఏక్తా కపూర్ రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీక్వెల్లో తమన్నా భాటియా(Tamannaah bhatia) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఏక్తా కపూర్(Ektha kapoor).. ఈ కథను ఆడియన్స్ కు చెప్పాలనే బలమైన ఆలోచనతోనే సీక్వెల్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త సినిమాలో ఓ వ్యక్తి జీవితమే ప్రధాన ఇతివృత్తంగా ఉండనుందని సూచించినప్పటికీ, ఆ పాత్ర ఎవరనే విషయాన్ని మాత్రం సీక్రెట్ గా ఉంచారు. మిలన్ లుథ్రియా(Milan luthriya) దర్శకత్వంలో రూపొందిన తొలి భాగం సౌత్ హీరోయిన్ సిల్క్ స్మిత(Silk Smitha) లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. వినోద పరిశ్రమలో ఆమె ఎదుగుదల, ఎదుర్కొన్న సవాళ్లను ఆ సినిమా ఆవిష్కరించింది.
ఇటీవలి కాలంలో గ్లామరస్ పాత్రలు, వెబ్ సిరీస్‌లలో బోల్డ్ సీన్స్ తమన్నా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ది డర్టీ పిక్చర్2(The dirty picture) లో ఆమె నటిస్తే కెరీర్‌కు మరో ఆసక్తికరమైన మలుపు లభించే అవకాశం ఉంది. అయితే సీక్వెల్లో ఆమె భాగమవుతారా? మొదటి భాగంతో పోలిస్తే కొత్త కథ ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది? అనే ప్రశ్నలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








