Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు, ఇన్ స్టాగ్రామ్ లో ట్రైలర్ పోస్ట్ చేసిన రెబల్ స్టార్
సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసలు అందించారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన “కపుల్ ఫ్రెండ్లీ” ట్రైలర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇది నేరుగా హృదయాల్లోంచి చెప్పిన ప్రేమ కథ అంటూ అప్రిషియేట్ చేశారు. తమ మూవీ ట్రైలర్ కు ప్రభాస్ నుంచి వచ్చిన ప్రశంసలతో “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/DUSFRJnEgkj/?igsh=YXhwYnowMHZyaXA1






