చరిత్రలో మరుగునపడిన కథలతో రణబాలి
విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(rashmika mandanna) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా రణబాలి(ranabaali) రిలీజ్ కు రెడీ అయింది. రాహుల్ సాంకృత్యాన్(rahul sankrithyan) దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణంలో, టీ-సిరీస్(T series) సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రణబాలి వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, డైరెక్టర్ రాహుల్ చేసిన పరిశోధన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. గ్రామీణ నేపథ్యంలో కథను రూపొందించే క్రమంలో డైరెక్టర్ తన ఊరికి వెళ్లి అక్కడి ప్రజల నుంచి ఎన్నో కథలను తెలుసుకున్నారని చెప్పారు. జాతరలు, పండుగలు, బుర్రకథలు, జానపద గాథల ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలు ఈ సినిమాకు బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. చరిత్రలో మరుగునపడిన కొన్ని కోణాలను ఆడియన్స్ కు పరిచయం చేసే ప్రయత్నమే ఈ సినిమా అని విజయ్ మాటల్లో అర్థమైంది.
ఇక డైరెక్టర్ అసాధారణ కథలను తెరపైకి తీసుకురావాలనే తపనతో పనిచేస్తారని విజయ్, రాహుల్ ను ప్రశంసించారు. మైత్రీ మూవీ మేకర్స్తో పాటు ఏందయ్యా సామి సాంగ్ ను అందించిన అజయ్(Ajay)- అతుల్(Atul)కు కృతజ్ఞతలు తెలిపారు. రష్మికతో ఇది తనకు మూడో సినిమా అని, నటిగా ఆమె ఎదుగుదల చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ కథలో తమ జంటకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొంటూ, అక్టోబర్ 16న థియేటర్లలో కలుద్దామని అభిమానులను ఆహ్వానించారు.







