ఓనం స్పెషల్ అవుట్ ఫిట్ లో నివేదా
నేచురల్ యాక్టింగ్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ నివేదా థామస్, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో కుర్రాళ్ల మనసులను దోచేస్తోంది. కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఓణం సందర్భంగా నివేదా థామస్(nivetha thomas) క్లాసిక్ ఐవరీ కలర్ కేరళ కసవు చేనేత చీరను ఎంచుకుని, అంచులకు ఉన్న గోల్డెన్ జరీ బోర్డర్ ఆమెకు మరింత పద్ధతిగల లుక్‌ను తెచ్చిపెట్టింది. ఈ చీరకట్టులో నివేదా చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తూ కేరళ కుట్టిలా అలరించింది. ఈ వైట్ శారీకి కాంబినేషన్‌గా నివేదా వేసుకున్న మెరూన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా చేతికి చిన్న గోల్డ్ వాచ్, చెవులకు మ్యాచింగ్ కమ్మలతో చాలా సింపుల్‌గా స్టైలింగ్ చేసుకోగా ఈ మినిమలిస్ట్ లుక్ ఆమె నేచురల్ బ్యూటీ ని మరింత రెట్టింపు చేసి చూపించింది.








