బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నితిన్ బిజీబిజీ
వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(nithin) ఇప్పుడు తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన, ప్రస్తుతం కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో నాని(nani) నిర్మాణంలో తెరకెక్కుతున్న అలియాస్ రుక్మిణి(Alias Rukmini) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు మరో కొత్త సినిమాకు కూడా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సామజవరగమన(Samajavaragamana), నారీ నారీ నడుమ మురారి(nari nari naduma murari) సినిమాలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు(ram abbaraju) ఈ కొత్త ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు. ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యమిచ్చే కథతో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ నెక్ట్స్ ఇయర్ మొదలు కానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, నితిన్ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) నిర్మిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్(Sresht movies)పై ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయ్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అంజి(Anji) ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్లు సమాచారం. మొత్తంగా నితిన్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో రెండు షూటింగ్ దశలో ఉండగా, మిగిలిన రెండు నెక్ట్స్ ఇయర్ సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. రాబోయే ప్రాజెక్టులతో సక్సెస్ ను అందుకోవడమే టార్గెట్ గా నితిన్ ముందుకు సాగుతున్నారు.








