దుబాయ్‌లో అంగరంగ వైభవంగా గల్ఫ్ తెలంగాణ ఫోరం బతుకమ్మ వేడుకలు..
గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను విదేశీ గడ్డపై ఘనంగా నిర్వహించి తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పారు. దుబాయ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు తరలివచ్చి విజయవంతం చేశారు.
ముఖ్య అతిథులు…
ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు తెలంగాణ నుంచి విచ్చేసిన పలువురు ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు మహేశ్ బీగాల, రాష్ట్ర నాయకురాలు ఐశ్వ షకీల్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
మహిళా సభ్యుల సమష్టి కృషి
జీటీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా రూపుదిద్దుకున్నాయి. జనరల్ సెక్రటరీలు బాలరాజ్ గౌడ్, యుజ్వేంద్ర, వైస్ ప్రెసిడెంట్లు శ్రీకాంత్, రాజేశ్, కోఆర్డినేటర్ రాజేశ్వర్, అభినవ్, చంద్రకాంత్ గుప్తా, రవన్న తదితర కార్యవర్గ సభ్యులు సమష్టిగా శ్రమించారు. అలాగే మహిళా విభాగం తరఫున కళ్యాణి, లక్ష్మీ అక్క, కల్పన, మమత, ఉషశ్రీ, వైదేవి, వేద, స్వాతి, లక్ష్మీసతీశ్ రెడ్డి, సీ.ఎస్.ఆర్, ఆనంద్ రెడ్డి, ప్రశాంత్, మహేశ్, రాజ్‌కుమార్, రజనీకాంత్, వెంకటేశ్, నక్క లక్ష్మణ్, అనుషా శ్రీకాంత్, అనుషా, శ్రీహరి రెడ్డి, కేశవిని సతీష్, ఉదయ్ కుమార్, శ్వేత, అరుంధతి రాజ్, మురళి, రజిత, సునీత, సుధా, శేఖర్, లీల, సంపత్ కుమార్ తదితర మహిళా సభ్యులు బతుకమ్మలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి
పండుగ వాతావరణం…
రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా అలంకరించిన బతుకమ్మలు, తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలు, ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలంగాణ పల్లె సంస్కృతిని కళ్లకు కట్టేలా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందోత్సాహాలతో ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు రుచికరమైన తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఆత్మీయ విందు భోజనాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం అందించారు.
భావితరాలకు సంస్కృతిని అందించడమే లక్ష్యం
విదేశాల్లో ఉన్నప్పటికీ మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు , పండుగలను భావితరాలకు సగర్వంగా పరిచయం చేయడమే జీటీఎఫ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరూ జీటీఎఫ్ కుటుంబంలో భాగస్వాములేనని, అందరి సమష్టి కృషితోనే ఈ వేడుకలు చారిత్రక విజయం సాధించాయని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జీటీఎఫ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.








