నవంబర్ సంచిక కోసం రచనలు ఆహ్వానిస్తున్న ‘‘సుజన రంజని’’ పత్రిక
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నడుస్తున్న సుజన రంజని నవంబర్ సంచికకు రచనలు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సుజన రంజని సంపాదక మండలి ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఆసక్తి వున్న వారు మీ తెలుగు వ్యాసాలు, కథలు, కవితలు, ఇతర సాహిత్య రచనలను ఈ నెల 30 వ తేదీ లోపు పంపించాలని కోరారు.
తాము రాసిన కథలు, వ్యాసాలు, కవితలు, ఇతర సాహిత్య ప్రక్రియలను సుజన రంజని పత్రికకు పంపించాలని భావించే వారు https://sujanranjani.siliconandhra.org కి మెయిల్ చేయాలి.
మరో వైపు ఇప్పటికే సుజన రంజని అక్టోబర్ సంచిక ఇప్పటికే మార్కెట్ లో విడుదలైంది.దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా దేవీ ఫోటోతో వున్న ముఖచిత్రంతో ఈ ప్రత్యేక సంచిక విడుదలైంది. ఈ సంచిక అత్యంత ఆకర్షణీయంగా, అందంగా వుంది. ఇందులో మనబడి విద్యార్థులు రచించిన పద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మన చిన్నారుల సృజనాత్మకతను, తెలుగు భాషపై వారికున్న మమకారాన్ని ప్రోత్సహిస్తూ, వారి రచనలను ఆస్వాదించండి.








