NBK111లో ఇద్దరు హీరోయిన్లు
నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna) ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ NBK111 షూటింగ్లో బిజీగా ఉన్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, మేకర్స్ కీలక ప్రకటన చేస్తూ లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara)ను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు వెల్లడించారు. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, తాజా గాసిప్స్ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్గా కాజల్ అగర్వాల్(kajal agerwal) ను ఎంపిక చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే కాజల్ సెట్స్‌లో జాయిన్ కానుండగా, సంగీత దర్శకుడు S. తమన్(Thaman) ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను వృద్ధి సినిమాస్(Vriddhi cinemas) నిర్మిస్తోంది.
ఇక బాలకృష్ణ తన షెడ్యూల్స్‌ను వేగంగా పూర్తి చేసి తదుపరి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలో విజయ్ కనకమేడల(vijay kanakamedala) దర్శకత్వంలో ఓ కాప్ డ్రామా ప్రారంభం కానుండగా, దీనిని సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri) నిర్మించనున్నారు. అదే విధంగా మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) బ్యానర్లో వివేక్ ఆత్రేయ(Vivek athreya) దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వరుస ప్రాజెక్టులతో ఆయన మళ్లీ ఫుల్ స్వింగ్‌లోకి వస్తున్నట్లు స్పష్టమవుతోంది.








