NBK111: గోపీచంద్ సినిమా కోసం లుక్ పై బాలయ్య వర్కవుట్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస హిట్లతో ఉన్న బాలయ్య ఆ జోష్ లోనే వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఒకదాని తర్వాత మరొకటి చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ గా అఖండ2 తాండవం(akhanda2 thandavam)తో ప్రేక్షకుల్ని పలకరించిన బాలయ్య, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంంటూ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలయ్య(balayya) ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopichand malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీ కోసం బాలయ్య ఆల్రెడీ కసరత్తులు చేయడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ యంగ్ గెటప్ లో కనిపించనున్నారని, దాని కోసమే బాలయ్య ఇప్పుడు ఆ లుక్ పై వర్కవుట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సినిమాలో ఈ యంగ్ గెటప్ చాలా కొత్తగా ఉంటూనే ఆడియన్స్ కు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపిస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఈ మూవీలో బాలయ్య మహరాజుగా కనిపిస్తారని, సినిమాలో కొంత భాగం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సతీష్ కిలారు(Sathish kilaru) నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార(nayanathara) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే గోపీచంద్, బాలయ్య కలయికలో వచ్చిన వీర సింహారెడ్డి(Veera Simhareddy) మంచి హిట్టైన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలున్నాయి.






