Nabha Natesh: చీరలో ఇస్మార్ట్ బ్యూటీ అందాల ఆరబోత
టాలీవుడ్ లో ఇస్మార్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్(nabha natesh), నన్ను దోచుకుందువటే(nannu dochukundhuvate) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది.

మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించిన నభా, తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) తో భారీ హిట్ ను ఖాతాలో వేసుకుంది.


ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమెకు స్టార్డమ్ ను అందించలేదు. మధ్యలో యాక్సిడెంట్ కారణంగా కెరీర్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న నభా ఇప్పుడు తిరిగి వరుస సినిమాలతో బిజీ అయింది.


ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నభా, తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోల్లో నభా ఉల్లిపొర లాంటి చీరలో, తన అందాలను ఆరబోస్తూ పోజులివ్వగా, ఆ ఫోటోలు యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో కూడా నభా ఎంతో అందంగా ఉందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.








