మోక్షజ్ఞ డెబ్యూ.. అంచనాలు పెంచుతున్న కాంబినేషన్..!
నందమూరి ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) సినీ అరంగేట్రానికి ఎట్టకేలకు అధికారికంగా తెరలేచింది. నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna) కొడుకుగా భారీ వారసత్వాన్ని అందిపుచ్చుకోబోతున్న మోక్షజ్ఞ, తన తొలి సినిమాకు ఎంతో ఆచితూచి అడుగులు వేసినట్లు తెలుస్తోంది. హడావుడిగా ఎంట్రీ ఇవ్వకుండా, తనకు సరిపోయే కథ కోసం అనేక కథలను పరిశీలించిన ఆయన చివరకు డైరెక్టర్ వశిష్ఠ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(Vishwambhara)ను తెరకెక్కిస్తున్న వశిష్ఠ, మోక్షజ్ఞ కోసం కూడా విభిన్నమైన కమర్షియల్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్తదనం, ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే సీన్స్ ఈ కథలో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయట. నందమూరి వారసుడి మొదటి సినిమాను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనుండటం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.
ఇక మోక్షజ్ఞ కూడా తన సినీ ప్రవేశం కోసం చాలాకాలంగా స్పెషల్ గా రెడీ అవుతున్నారు. ఫిజిక్‌తో పాటు యాక్టింగ్, , స్క్రీన్ ప్రెజెన్స్‌కు అవసరమైన పలు అంశాల్లో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సరైన డైరెక్టర్, భారీ నిర్మాణ సంస్థ, ఆసక్తికరమైన కథతో మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.








