నాని బ్లడీ రోమియోకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్!
నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ సుజీత్(Sujeeth) కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ బ్లడీ రోమియో(Bloody romeo)పై ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్రబృందం నెక్ట్స్ షెడ్యూల్స్కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి కీలకమైన మార్పు చోటుచేసుకుంది. సినిమా ఓపెనింగ్ టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చేసిన ప్రవీణ్ లక్కరాజు(Praveen lakkaraju) స్థానంలో ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పు వెనుక కారణాలేంటన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఇవి కూడా చదవండి
తాజాగా దురంధర్(Durandhar) సినిమాకు అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శాశ్వత్ సచ్దేవ్(Sasvath Sachdev) ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వరుస డిస్కషన్స్ తర్వాత ఆయనను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బ్లడీ రోమియో కథకు తన ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్‌తో శాశ్వత్ ఎలాంటి కొత్తదనాన్ని తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను లండన్ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిర్వహించేందుకు డైరెక్టర్ సుజీత్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి(Venkat boyinpalli) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







