క్రిస్మస్కు రాకా గ్లింప్స్.. 2027 మార్చికి షూటింగ్ పూర్తి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా(Raaka)పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కావాల్సిన వీడియో టీజర్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశకు గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ముంబైలో ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న దీపికా పదుకొణె(Deepika Padukone) తనకు సంబంధించిన షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor), రష్మిక మందన్నా(rashmika mandanna), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అట్లీ స్పెషల్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ముందుగా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని భావించినప్పటికీ, తాజా షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ 2027 మార్చి వరకు కొనసాగే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేసి అల్లు అర్జున్ను ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తర్వాత అట్లీ పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పై దృష్టి సారించనున్నారు. క్రిస్మస్ 2027ను టార్గెట్ గా చేసుకుని సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాయి అభ్యంకర్(Sai Abhyankar) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రిలీజ్ డేట్ తో పాటూ గ్లింప్స్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







