రిలీజై ఇన్నాళ్లవుతున్నా అదరగొడుతున్న హనుమాన్ అంశ్
హనుమాన్ అంశ్(hanuman ansh) థియేటర్లలో తన జోరును కొనసాగిస్తోంది. రిలీజై 52 రోజులు పూర్తైనా ఆడియన్స్ ఆదరణలో పెద్దగా మార్పు కనిపించకపోవడం విశేషంగా మారింది. కొత్త సినిమాలు వరుసగా థియేటర్లలోకి వస్తున్న సమయంలోనూ ఈ డివోషనల్ బ్యాక్‌గ్రౌండ్ మూవీ ఎనిమిదో వారంలో కూడా మంచి ఆక్యుపెన్సీతో అదరగొడుతుంది. ముఖ్యంగా వీకెండ్లో ఆడియన్స్ రెస్పాన్స్ మరోసారి పెరగడం సినిమాకు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.
విశాల్ చతుర్వేది(vishal chaturvedi) రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయన రాసిన డివైన్ డిటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్ బుక్ ఆధారంగా రూపొందింది. స్వాతంత్య్రానికి ముందు కాలంలో లక్ష్మీ నారాయణ్ లైఫ్, తర్వాత ఆయన ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన నీమ్ కరోలి బాబాగా మారిన ప్రయాణాన్ని కథగా ఆవిష్కరించారు. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వడం సినిమాకు ప్రత్యేకమైన ప్రేక్షక వర్గాన్ని తీసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ కు ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్స్ నిర్మాతలకు భారీ లాభాలను అందించే స్థాయికి తీసుకెళ్లింది. సాధారణంగా కొన్ని వారాలకే థియేట్రికల్ రన్ ముగిసే పరిస్థితుల్లో ఈ సినిమా 52 రోజులు దాటడం ఇండస్ట్రీలో ఆసక్తికర అంశంగా మారింది. కొత్త రిలీజుల మధ్య కూడా తన పెర్ఫార్మెన్స్ ను కంటిన్యూ చేస్తూ, చిన్న బడ్జెట్ సినిమాకు స్ట్రాంగ్ మౌత్ టాక్ ఎంతటి ఫలితాన్ని అందించగలదో ఈ సినిమా మరోసారి చూపిస్తోంది.








