శ్రీలంకలో ‘డ్రాగన్’ గర్జనకు రెడీ.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
ఎన్టీఆర్(NTR) హీరోగా, ప్రశాంత్ నీల్(Prasanth Neel) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ (Dragon) షూటింగ్‌కు సంబంధించిన తాజా అప్డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, తదుపరి కీలక షెడ్యూల్ కోసం చిత్ర బృందం శ్రీలంకకు వెళ్లేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో జరగనున్న ఈ లాంగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ను ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. శ్రీలంకలోని అందమైన, వైవిధ్యమైన లొకేషన్లను ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ లో కీలక భాగం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఓపియం వ్యాపార నేపథ్యంతో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ లూగర్(Lugar) అనే పాత్రలో కనిపించనున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రౌద్రమూర్తి, బీస్ట్ తరహా అవతారంలో ఆయన కనిపించబోతున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హీరోయిన్గా నటిస్తున్న రుక్మిణి వసంత్(Rukmini vasanth) కూడా ఈ షెడ్యూల్ కోసం భారీ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్(anil kapoor), మలయాళ నటుడు బిజు మీనన్(Biju menon) కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో డ్రాగన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్(Ravi Basrur) స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts), మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








