వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్
మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav tej) ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్లో సంచలన ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన కొండపొలం(Konda polam), రంగ రంగ వైభవంగా(Ranga ranga vaibhavanga), ఆదికేశవ(Adhikeshava) సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో వైష్ణవ్ తేజ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడిచింది. గత మూడు సంవత్సరాల్లో వందకు పైగా కథలు విన్నప్పటికీ, వాటిలో ఏ ఒక్కదానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాలీవుడ్లో ప్రచారం జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఆయనను సంప్రదించినప్పటికీ సరైన కథ కోసం ఎదురు చూశాడనే టాక్ వినిపించింది.
ఇలాంటి పరిస్థితుల్లో వైష్ణవ్ తేజ్ తన తదుపరి సినిమాకు ఎట్టకేలకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు డైరెక్టర్ మహేష్ ఎస్(Mahesh S) దర్శకత్వం వహించనున్నారు. గతంలో సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా తెరకెక్కిన హంట్(Hunt) సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. మహేష్ చెప్పిన కథ, దాని ట్రీట్మెంట్ వైష్ణవ్ తేజ్‌ను ఆకట్టుకోవడంతో వెంటనే ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments) బ్యానర్‌పై అనిల్ సుంకర(Anil sunkara) నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని సమాచారం. వచ్చే నెలలో అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. వరుస నిరాశల తర్వాత వైష్ణవ్ తేజ్ కెరీర్‌కు ఈ సినిమా కీలకంగా మారనుండటంతో మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి








