Vaishnav Tej: కథల వేటలో వైష్ణవ్

ఉప్పెన(Uppena) సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej). ఉప్పెన తర్వాత వైష్ణవ్ కెరీర్లో మరో సాలిడ్ హిట్ కూడా రాలేదు. ఉప్పెన సక్సెస్ ఇచ్చిన జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఆ సినిమాలు కూడా అంతే ఆడతాయనుకుని వైష్ణవ్ చేసిన మూవీస్ మొత్తం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగానే నిలిచాయి. వైష్ణవ్ నుంచి ఆఖరిగా వచ్చిన ఆదికేశవ(Adhikeshava) అయితే అసలు ఎప్పుడు రిలీజైందో ఎప్పుడు థియేటర్ల నుంచి పోయిందో కూడా తెలియదు.
ఆదికేశవ తర్వాత వైష్ణవ్ మరో సినిమాను మొదలు పెట్టింది లేదు. ఈ సారి మరో సినిమా చేస్తే హిట్ సినిమానే చేయాలని మంచి కథ కోసం వెతుకుతున్నాడు, కెరీర్ లో గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ మంచి కథ దొరికితే సెట్స్ పైకి వెళ్తానని మొండిగా ఉన్నాడట వైష్ణవ్. సినిమాల ఎంపికలో అసలు ఎక్కడ లోపం జరుగుతుందనే విషయాన్ని తేల్చుకోవడానికి వైష్ణవ్ ఈ బ్రేక్ తీసుకున్నాడని తెలుస్తోంది.
అంతేకాదు, ఈసారి కంటెంట్ విషయంలో కూడా ఆడియన్స్ ను సర్‌ప్రైజ్ చేసేలా కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నాడట వైష్ణవ్. దీంతో వైష్ణవ్ నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా అని మెగాఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఓ వైపు టాలీవుడ్ లోని యంగ్ హీరోలంతా కెరీర్ లో దూసుకెళ్తుంటే వైష్ణవ్ మాత్రం ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు.