తనపై వచ్చిన రూమర్లపై రియాక్ట్ అయిన ధృవ్ విక్రమ్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) రీసెంట్ గా తన గత రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన ఆ రిలేషన్లో తాను ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే రిలేషన్ లో ఉన్న వ్యక్తి పేరును అనుపమ ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో ఆమెకు ధృవ్ విక్రమ్(Dhruv vikram)తో ఉన్న రిలేషన్షిప్ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు ఈ కామెంట్స్ ను అతడితో ముడిపెట్టారు. దీంతో ధృవ్ పర్సనల్ లైఫ్ ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది.
ఈ పరిణామాలపై ధృవ్ విక్రమ్ తాజాగా రియాక్ట్ అవుతూ, తన వ్యక్తిగత విషయాలపై ఇంతటి స్థాయిలో చర్చ జరగడం అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. తాను సాధారణంగా పర్సనల్ లైఫ్ ను బహిరంగంగా మాట్లాడే వ్యక్తిని కాదని, అయినప్పటికీ ప్రస్తుతం తనపై అనవసరమైన ఫోకస్ పెరిగిందనే భావనను వ్యక్తం చేశారు. ప్రతి డిస్కషన్ కు, ప్రతి ఊహాగానానికి రియాక్ట్ అవడం కంటే తన పని, కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం.
మరోవైపు, అనుపమ తన గత రిలేషన్ తనపై చూపిన ప్రభావాన్ని బహిరంగంగా వివరించినప్పటికీ, ఆమె కామెంట్స్‌లో ధృవ్ విక్రమ్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావనకు రాలేదు. అంతేకాకుండా ఆ సంబంధాన్ని పెళ్లి దిశగా తీసుకెళ్లకుండా తానే ఆపుకున్నానని ఆమె వెల్లడించారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో సోషల్ మీడియా ఊహాగానాలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది.








